చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదు: రాజ్ నాథ్ సింగ్

చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదు: రాజ్ నాథ్ సింగ్

అమరావతి, వెలుగు: ఏపీ సీఎం చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదని, ఎన్నికల తర్వాత ఆయనకు ప్రజలు పూర్తి విశ్రాంతి ఇస్తారని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఎన్నికల్లో తాను ఓడినా తనకు కుటుంబం ఉందని చెప్పడంతో బాబు ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించారన్నా రు. బుధవారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. “చంద్రబాబు అధికారంలోకి రాగానే రైతులను విస్మరించారు. ఒకటిన్నర రెట్లు మద్దతు ధర పెంచి కేంద్రం రైతులకు అండగా నిలిచింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద నిధులు మంజూరు చేస్తే,రైతుల వివరాలు ఇవ్వకుం డా కుట్ర చేశారు.టీడీపీతో పొత్తు ఉన్నా లేకపోయినా ఏపీకి నిధులిచ్చాం . మరోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే బందరు పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తాం ” అని అన్నారు.