రజినీ ‘దర్బార్‘ షూటింగ్ మొదలైంది..

రజినీ ‘దర్బార్‘ షూటింగ్ మొదలైంది..

తలైవా రజినీకాంత్  నటిస్తున్న న్యూ మూవీ దర్బార్.  మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్నఈ మూవీ లోగోతో పాటు ఫస్ట్ లుక్ మంగళవారమే రిలీజ్ చేశారు.  లేటెస్ట్ గా  బుధవారం దర్బార్ షూటింగ్ కు సంబంధించి ముంబైలో పూజాకార్యక్రమాలు చేసింది మూవీ యూనిట్. రజినీ కాంత్, మురుగదాస్ తో పాటు మూవీ టీం మెంబర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రజినీ కాంత్ 167 వ మూవీగా వస్తున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోంది. నయన తార హోరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా సంతోష్ శివన్, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.  వచ్చే సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కానుంది.