రూటెడ్ లవ్ స్టోరీగా రాజు వెడ్స్ రాంబాయి

రూటెడ్ లవ్ స్టోరీగా రాజు వెడ్స్ రాంబాయి

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా  మన నేటివ్ లవ్ స్టోరీతో తెరకెక్కించిన చిత్రం  ‘రాజు వెడ్స్ రాంబాయి’ అని డైరెక్టర్ సాయిలు కంపాటి అన్నాడు.  అఖిల్, తేజస్విని జంటగా నటించిన ఈ సినిమాను  వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. నవంబర్ 21న సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు సాయిలు మాట్లాడుతూ ‘ఇదొక రూటెడ్ లవ్ స్టోరీ.  చిన్నప్పుడు మా ఊరిలో  జరిగిన ఘటన ఆధారంగా స్ర్కిప్ట్  రాశా. సినిమా స్క్రిప్ట్ ఎలా రాయాలనే అవగాహన లేక తెలిసినవన్నీ రాశాను. అవన్నీ తెరపైకి తీసుకురాలేము.  

అప్పుడు వేణు అన్న అసలు స్క్రిప్ట్ ఎలా ఉండాలో చెప్పారు. ఇది పరువు హత్యకు సంబంధించిన కథ కాదు. కానీ అలాంటిదే. హీరో అఖిల్ మా వరంగల్ జిల్లా అతనే. రాజు క్యారెక్టర్‌‌‌‌కు కావాల్సిన ఈజ్ అఖిల్‌‌లో కనిపించింది. అలాగే  రాంబాయి పాత్ర కోసం కొత్తమ్మాయి తేజస్వినిని తీసుకున్నాం.  హీరోయిన్ ఫాదర్ రోల్‌‌లో  చైతన్య జొన్నలగడ్డ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఈ మూవీ షూటింగ్ మొత్తం మా ఊర్లోనే చేశాం.  సురేష్ బొబ్బిలి సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కంటెంట్‌‌పై నమ్మకంతో   బన్నీ వాస్, వంశీ నందిపాటి రిలీజ్‌‌కు ముందుకొచ్చారు’ అని చెప్పాడు.