అఖిల్, తేజస్విని జంటగా సాయిలు కంపాటి దర్శకత్వంలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 21న బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
అతిథిగా హాజరైన అడివి శేష్ మాట్లాడుతూ ‘వైరల్ కంటెంట్ ఎలా చేయాలని ఆలోచిస్తున్న ఈ సోషల్ మీడియా యుగంలో ఒక స్వచ్ఛమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రావడం సాధారణ విషయం కాదు. సోషల్ మీడియా యాప్స్ మారుతుంటాయి కానీ ప్రేమ మారదు. ప్రేక్షకుల హార్ట్ టచ్ చేసేలా సినిమా ఉంటుంది’ అని చెప్పాడు.
ఆడియెన్స్ గుండెల్లో నిలిచిపోయే ప్రేమకథ అని హీరో హీరోయిన్స్ అన్నారు. తన కథను నమ్మిన నటీనటులు, నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాడు దర్శకుడు సాయిలు. ఇది కాలానికి అతీతమైన ప్రేమ కథ అని వేణు ఊడుగుల అన్నాడు. మర్చిపోలేని ప్రేమకథ ఇదని నిర్మాత రాహుల్ మోపిదేవి చెప్పారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుందని నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి అన్నారు. నటులు చైతు జొన్నలగడ్డ, శివాజీ రాజా, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్ పాల్గొన్నారు.
