న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యులందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని, పార్లమెంటరీ చర్చలో నియమాలు పాటించాలని.. ఎవరూ లక్ష్మణరేఖను దాటొద్దని సూచించారు. సోమవారం సభలో తన తొలి ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “ఎగువసభలో చాలా పెద్ద విషయాలపై చర్చించాల్సి ఉంది. సభ్యులకైనా, చైర్కైనా టైం అనేది సవాలుతో కూడుకున్నది. దేశంపట్ల మన బాధ్యతలు తెలుసుకోవాలి.
మన రాజ్యాంగం, రాజ్యసభ నియమాల పుస్తకం పార్లమెంటరీ చర్చలకు లక్ష్మణరేఖను నిర్ణయిస్తాయి. ప్రతి సభ్యుడి హక్కులను లక్ష్మణరేఖకు లోబడే రక్షించాలి. మీ అందరి న్యాయమైన హక్కుల కోసం నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను” అని రాధాకృష్ణన్ రాజ్యసభలో పేర్కొన్నారు. అలాగే, శీతాకాల సమావేశాల మొదటి రోజున తనను అభినందించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, సభలోని సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
