- దీపాదాస్ మున్షీపై ప్రభాకర్ ఆరోపణలు సరికావు
- ఆయనపై పరువు నష్టం దావా వేస్తా: ఎంపీ రేణుకా చౌదరి
హైదరాబాద్, వెలుగు : తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తుంటే.. కేంద్రం ఏం చేస్తున్నదని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రశ్నించారు. బుధవారం అసెంబ్లీలో కార్యదర్శి నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైనట్టు ఆమె ధృవీకరణ పత్రం తీసుకున్నారు.
ఆ తర్వాత గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. వాటికి ఆధారాలు ఉన్నాయా? ఆయనపై పరువు నష్టం దావా వేస్తా. సీఎం రేవంత్ రెడ్డి మహిళా పక్షపాతి. ఫ్రీ బస్ జర్నీతో తెలంగాణ మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు’’అని ఆమె అన్నారు.
