న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనం కావడాన్ని చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదించడంపై సోమవారం కాంగ్రెస్ ఫైర్ అయ్యింది. ఈ పరిణామం తమకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు.
గతంలో ఇదే ఎంపీలపై అవినీతి ఆరోపణలు చేసిన బీజేపీ... ఇప్పుడు ఎందుకు పార్టీలో చేర్చుకుందని ప్రశ్నించారు. ఈ ఎంపీలపై ఇక ఈడీ దాడులు ఆగుతాయని విమర్శించారు. ఈ ఫిరాయింపును ఒక ‘‘సర్జికల్ స్ట్రైక్, ముందస్తు జాగ్రత్త చర్య”అంటూ అభివర్ణించారు. ‘‘ఆపరేషన్ లోటస్' ద్వారా ప్రతిపక్షాలను బలహీనపరుస్తున్న తీరు చూస్తే ‘లోటస్ కాస్తా లూటస్’ గా మారినట్లుందని ఆయన ఆరోపించారు.

