ఐపీఎల్ సీజన్‌‌లోనూ పాజిటివ్ టాక్‌‌తో రాకాస

ఐపీఎల్ సీజన్‌‌లోనూ పాజిటివ్ టాక్‌‌తో  రాకాస

సంగీత్ శోభ‌‌న్‌‌, న‌‌య‌‌న్ సారిక‌‌ జంటగా మానస శర్మ దర్శకత్వంలో నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘రాకాస’.  శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌‌తో దూసుకుపోతోందని టీమ్ చెప్పింది. ఈ సందర్భంగా  సమ్మర్ ఫన్‌‌టాస్టిక్ హిట్‌‌ పేరుతో ఈవెంట్‌‌ను నిర్వహించారు.

 అతిథిగా హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ఐపీఎల్ సీజన్‌‌లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్  వస్తుండటం గొప్ప విషయం. కామెడీ ఉంటే జనాలు కచ్చితంగా చూస్తారని మరోసారి ప్రూవ్ చేశారు. నిహారిక చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఓ మూవీని ఆడియెన్స్‌‌కి ఎంతవరకు రీచ్ చేయాలో  అన్నీ చేశారు. 

ఈ టీమ్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నా’ అని అన్నాడు. సినిమాకొస్తున్న రెస్పాన్స్ పట్ల హ్యాపీగా ఉన్నామని  సంగీత్ శోభన్, నయన్ సారిక, మానస శర్మ, నిహారిక అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.