దేశ మహిళలకు రాఖీ గిఫ్ట్.. గ్యాస్ ధర తగ్గించిన కేంద్రం

దేశ మహిళలకు రాఖీ గిఫ్ట్.. గ్యాస్ ధర తగ్గించిన కేంద్రం

దేశ మహిళలకు ప్రధాని మోదీ గిఫ్ట్.. రక్షా బంధన్ కానుకగా వంట గ్యాస్ ధరలు తగ్గించింది కేంద్రం.. సిలిండర్ పై 200 రూపాయల సబ్సిడీని ప్రకటించింది. ఉజ్వల స్కీం లబ్ధిదారులకు సిలిండర్ పై 400 రూపాయలు తగ్గించింది. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్ర కేబినెట్ ప్రకటించింది. 

ప్రస్తుతం దేశంలో 14 కేజీల వంట గ్యాస్ బండ ధర 11 వందల రూపాయలు. ప్రధాని మోదీ రాకముందు సిలిండర్ ధర 450 రూపాయలు..  ఈ తొమ్మిదేళ్లలో మూడింతలు పెరిగింది.  దీనికి తోడు నిత్యావసరాల ధరలు కూడా  భారీగా పెరిగాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి జనాలపై తీవ్ర ప్రభావం చూపింది. 

Also Read :- Asia Cup2023: బ్యాడ్ న్యూస్.. పాకిస్తాన్ మ్యాచ్‌కు స్టార్ ప్లేయర్ దూరం

వంట గ్యాస్ ధరలు, నిత్యావసరాల ధరలు పెరుగుదలపై ప్రతిపక్షాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, రాబో యే ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో భారీగా వంటగ్యాస్ ధరలు తగ్గింది.. అయితే గత తొమ్మిదేళ్లలో పెరిగిన పెట్రోల్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.