హైడ్రాకు మద్దతుగా నల్లచెరువు దగ్గర ర్యాలీ

హైడ్రాకు మద్దతుగా నల్లచెరువు దగ్గర ర్యాలీ

 హైదరాబాద్ లో హైడ్రాకు రోజురోజుకు  ప్రజల మద్దతు పెరుగుతోంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, పార్కులను కాపాడుతుండటంతో హైడ్రాకు మద్దతు పెరుగుతోంది. లేటెస్ట్ గా నవంబర్ 27న  హైడ్రా పని తీరును ప్రశంసిస్తూ నల్లచెరువు దగ్గర  వాకార్స్ ర్యాలీ నిర్వహించారు.  నల్ల చెరువును అభివృద్ధి చేసిన తర్వాత ఆహ్లాదకర వాతావరణం ఏర్పడిందటూ హైడ్రా పై స్థానికులు హార్షం వ్యక్తం చేశారు.  

చెరువు అభివృద్ధి, పునరుద్ధరణ అంటే ఏంటో హైడ్రా చూపించిందంటున్నారు స్థానికులు..చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ తో పాటు పటిష్టమైన బండ్ నిర్మించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  ఓపెన్ జిమ్, షటిల్ కోర్టులతో పాటు చిల్డ్రన్ ప్లే ఏరియా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు స్థానికులు.  చెరువు చుట్టూ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి, హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు స్థానికులు.

ఇప్పటి వరకు రూ.55 వేల కోట్లకు పైగా విలువైన ప్రజల ఆస్తులను కాపాడింది హైడ్రా.  మొత్తం 181 డ్రైవ్స్‌లో 954 కబ్జాలు తొలగించామని, వెయ్యి 45 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్  తెలిపారు.  రూ.58 కోట్లతో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో మరిన్ని చెరువుల అభివృద్ధి లక్ష్యంగా హైడ్రా ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. ప్రభుత్వం దిశానిర్దేశాల మేరకు ప్రకృతి పరిరక్షణే హైడ్రా ప్రధాన ధ్యేయం అని అన్నారు.