
మల్కాజ్గిరి, వెలుగు: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ మేకల సునీత, ఆమె భర్త రాము అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని గౌతమ్ నగర్ డివిజన్ మీర్జాలగూడ చిన్మయ మార్గ్ , రాజానగర్, వెంకటాద్రి నగర్ప తదితర కాలనీల వాసులు ఆరోపించారు. సోమవారం పాదయాత్రగా రాజీవ్ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ తీశారు.
మురుగు నీరు రోడ్లపై ప్రవహించి, రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హుడా మాస్టర్ ప్లాన్ ప్రకారం 66 అడుగులు ఉండవలసిన రోడ్డు 15 అడుగులకు తగ్గిందన్నారు. మురుగు నీటి సమస్య తీర్చాలని తిరుగుతున్నా కార్పొరేటర్, ఆమె భర్త పట్టించుకోవడం లేదని వాపోయారు. పరిష్కరించకపోతే మల్కాజ్గిరి చౌరస్తాలో నిరవధిక దీక్షలు చేపడుతామని హెచ్చరించారు.