ఫ్యామిలీ వెకేషన్‌‌ను ఎంజాయ్ చేస్తున్నా రామ్ చరణ్

ఫ్యామిలీ వెకేషన్‌‌ను ఎంజాయ్ చేస్తున్నా రామ్ చరణ్

ప్రస్తుతం ఫ్యామిలీ వెకేషన్‌‌ను ఎంజాయ్ చేస్తున్నాడు రామ్ చరణ్. పారిస్ ఒలింపిక్స్ చూసేందుకు ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. అక్కడ దిగిన ఓ ఫొటోను అభిమానుల కోసం షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  బ్లాక్ కలర్ షేడ్స్, లైట్ గడ్డం, టోపీతో కౌబాయ్ గెటప్‌‌లో స్టైలిష్‌‌గా కనిపిస్తున్నాడు చరణ్. మరోవైపు చిరంజీవి కూడా ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.  

ఇక రామ్​ చరణ్ హీరోగా శంకర్​ తెరకెక్కిస్తున్న ‘గేమ్​ చేంజర్​’ చిత్రం డిసెంబర్​లో విడుదల కానుంది. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పోర్ట్స్​ డ్రామాలో రామ్​చరణ్ నటించనున్నారు.