Ram Charan : 'పెద్ది' మూవీ రేంజ్ మార్చిన 'చికిరి చికిరి' మాస్ బీట్.. 24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్!

Ram Charan : 'పెద్ది' మూవీ రేంజ్ మార్చిన 'చికిరి చికిరి' మాస్ బీట్.. 24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'.  భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీ అంచనాలకు అందని స్థాయిలో దూసుకుపోతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ,  గ్లింప్స్‌ సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి. లేటెస్ట్ గా వచ్చిన తొలి లిరికల్ సాంగ్ సంచలనం సృష్టిస్తోంది. విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తూ.. ఫ్యాన్స్ మంచి కిక్కు ఇస్తోంది. 

ఇండియన్ సినిమా రికార్డు బ్రేక్!

'చికిరి చికిరి' అంటూ సాగే ఈ మాస్ బీట్ పాట శుక్రవారం (నవంబర్ 7న) విడుదలైనప్పటి నుండి వ్యూస్ పరంగా సునామీ సృష్టిస్తోంది. ఈ పాట కేవలం 24 గంటల్లోనే 46 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక వ్యూస్ అందుకున్న పాటగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. అంతకుముందు సౌత్ ఇండియా రికార్డును కేవలం 13 గంటల్లోనే 32 మిలియన్ల వ్యూస్‌తో బద్దలు కొట్టడం ఈ పాట సాధించిన మరో ఘనత. 'పెద్ది' మేకర్స్ ఈ రికార్డును గర్వంగా ప్రకటించారు. మెగా పవర్ స్టార్ క్రేజ్, ఆస్కార్ విజేత సంగీతం కలిస్తే ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో ఈ విజయం నిరూపించిందంటున్నారు.

 ఏ.ఆర్. రెహమాన్ మ్యాజిక్

ఈ రికార్డ్-బ్రేకింగ్ పాట విజయం వెనుక ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ స్వరాలు కీలకపాత్ర పోషించాయి. చాలా కాలం తర్వాత రెహమాన్ ఒక డైరెక్ట్ తెలుగు సినిమాకు సంగీతం అందిస్తుండడం, అది కూడా రామ్ చరణ్‌తో కావడం మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ గా నిలిచింది. బుచ్చిబాబు సానా అందించిన పక్కా రూరల్ బీట్ లిరిక్స్, మోహిత్ చౌహాన్ గంభీరమైన గాత్రం, రెహమాన్ మాస్ బీట్ మ్యూజిక్ కలసి ప్రేక్షకులను థియేటర్లలో ఊపేయడం ఖాయంగా కనిపిస్తోంది.  కథానాయకుడు 'పెద్ది' హీరోయిన్ అచ్చియమ్మ (జాన్వీ కపూర్)ను మొదటిసారి చూసినప్పుడు ఆమె అందాన్ని వర్ణించడానికి తమ పల్లెటూరిలో ఉపయోగించే "చికిరి" అనే పదాన్ని ఈ పాటలో వాడుకలోకి తెచ్చినట్లు దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు. ఈ పాటను జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

రామ్ చరణ్, జాన్వీ కపూర్ వైబ్స్

'చికిరి చికిరి' పాటలో రామ్ చరణ్ చూపించిన ఎనర్జీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఊర మాస్ లుక్‌లో, స్టైలిష్‌ స్వాగ్‌తో ఆయన వేసిన హుక్ స్టెప్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయ్యాయి. గతంలో చరణ్ 'చిరుత' సినిమాలో చూపించిన ఎనర్జీని గుర్తు చేసేలా ఈ స్టెప్పులు ఉన్నాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక, హీరోయిన్ జాన్వీ కపూర్ తన అచ్చియమ్మ పాత్రలో పల్లెటూరి అమ్మాయిలా కనిపించినప్పటికీ, తన సోయగాలు, స్టైలిష్ లుక్స్‌తో పాటలోని విజువల్స్ పీక్‌కు చేర్చింది. 

 'పెద్ది' సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీ మార్చి 27, 2026 న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాను గ్రామీణ క్రీడా నేపథ్యంతో, ఎటువంటి ఏఐ/వీఎఫ్‌ఎక్స్ ఉపయోగించకుండా రియల్ లొకేషన్లలో షూట్ చేయడంతో, రామ్ చరణ్ రస్టిక్ ట్రాన్స్‌ఫర్మేషన్, జాన్వీ అయస్కాంతం లాంటి స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్‌కి బాగా నచ్చాయి. ఈ పాట ఇప్పటికే మెగా అభిమానులకే కాకుండా, మ్యూజిక్ లవర్స్‌కి కూడా ఓ విజువల్ ఫీస్ట్‌గా మారింది.