ఆ సినిమా చూడనోళ్లు మనుషులు కాదా : వర్మ గెలుకుడు..

ఆ సినిమా చూడనోళ్లు మనుషులు కాదా : వర్మ గెలుకుడు..

యానిమల్‌ (Animal) మూవీ ఇండియా బాక్సాపీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమా చూసిన స్టార్ హీరోస్, స్టార్ మేకర్స్ స్పందించకుండా ఉండలేకపోతున్నారు.గత రెండ్రోజులుగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) యానిమల్ మూవీపై తనదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తోన్నాడు.

లేటెస్ట్గా మరోసారి ట్వీట్ చేస్తూ..తనదైన పంథాను చాటుకున్నారు RGV. యానిమల్ అనేది మూవీ కాదు. ఓ సోషల్‌ స్టేట్‌మెంట్‌’..ఇప్పటికీ యానిమల్ సినిమా చూడకపోతే..మీరూ నిజమైన యానిమల్స్ తో సమానం అంటూ ట్వీట్ లో తెలిపారు. ప్రస్తుతం వర్మ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

రీసెంట్ గా యానిమల్ సినిమాపై వర్మ స్పందిస్తూ..డైరెక్టర్ సందీప్ మునుపెన్నడూ చూడని సీన్లని అద్భుతంగా చూపించడం బాగుంది. సినిమా అంటే ఇలాగే ఉండాలని అనుకునే డైరెక్టర్లందరికీ ఫ్యూజులు ఎగిరిపోయేలా ఒక ఎలక్ట్రిక్‌ షాక్ ఇచ్చాడు. వాళ్ళు నమ్మే చాదస్తపు నైతిక విలువులన్నింటినీ తన చీపురు కట్టతో ఊడ్చి ఎత్తి చెత్త కుండీలో పడేశాడు.కెమెరా కనుగొన్న మొదలు ఇప్పటివరకూ అందరూ నమ్ముతున్న సినీ సంప్రదాయాలన్నింటినీ నీ ఎడమ కాలి బూటుతో తన్ని తన్ని రక్తాలు కక్కుకునేలా చేశావు సందీప్‌ అంటూ..డైరెక్టర్ సందీప్ రెడ్డిని ప్రశంసల్లో ముంచెత్తారు. 

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అల్లకల్లోలం సృష్టిస్తోంది.కలెక్షన్స్ రోజు రోజుకు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి.ఇప్పటివరకు రూ 560 కోట్లకు పైగా సాధించినట్టు మేకర్స్ పోస్ట్ చేశారు. ఈ యానిమల్ కలెక్షన్స్ రూ. 1000 కోట్ల దిశగా పరుగులు తీస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.