సివిల్స్, గ్రూప్స్ అభ్యర్థులతో రామ్‌‌‌‌‌‌‌‌ గోపాల్ వర్మ భేటీ

సివిల్స్, గ్రూప్స్ అభ్యర్థులతో రామ్‌‌‌‌‌‌‌‌ గోపాల్ వర్మ భేటీ

హైదరాబాద్, వెలుగు: కృష్ణప్రదీప్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సివిల్స్, గ్రూప్స్ అభ్యర్థులతో బుధవారం సినీ దర్శకుడు రామ్‌‌‌‌‌‌‌‌ గోపాల్ వర్మ ముచ్చటించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కృష్ణ ప్రదీప్ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. న్యూ జనరేషన్ రైట్స్, హోమో సెక్సువల్ హక్కులు, సేమ్ సెక్స్ మ్యారేజ్, ఎల్‌‌‌‌‌‌‌‌జీబీటీ పై సుప్రీం కోర్టు తీర్పులు, ప్రస్తుత విద్యా విధానం, కుటుంబ వ్యవస్థ, మహిళలపై సమాజం తీరు లాంటి విషయాలతో పాటు స్టూడెంట్లు అడిగిన ప్రశ్నలకు రామ్ గోపాల్ వర్మ సమాధానాలు ఇచ్చారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యా విధానంలో నిరంతరం మార్పు జరగాలన్నారు.  ఎల్‌‌‌‌‌‌‌‌జీబీటీల విషయంలో సమాజ దృక్పథంలో మార్పు లాంటి విషయాల గురించి తెలిపారు. విడుదలకు సిద్ధంగా ఉన్న డేంజరస్ సినిమా గురించి  ఆయన వివరించారు.