
అయోధ్య, ఫైజాబాద్ లో సెక్యూరిటీ టైట్ గా మారింది. వివాదాస్పద స్థలంపై మధ్యవర్తుల బృందం తో ఇవాళ సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. పండిట్ రవిశంకర్ , రిటైర్డ్ జస్టిస్ ఖలీఫుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ బస చేసిన గందేలాల్ దీక్షిత్ వీఐపీ గెస్ట్ హౌజ్ అర కిలోమీటర్ పరిధిలో రాకపోకలను నియంత్రించారు. సుప్రీం సూచనల ప్రకారం సంప్రదింపుల్లో గోప్యతను పాటించేందుకు మీడియాను కూడా అనుమతించలేదు. స్థానికులను తనిఖీలు చేస్తున్నారు. బయటి వ్యక్తులను అనుమతించడం లేదు. అవధ్ యూనివర్శిటీలో ఈ గెస్ట్ హౌజ్ ఉండడంతో తరగతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అవధ్ యూనివర్శిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని నివాసాలను పోలీసులు జల్లెడ పట్టారు. ఏయే ఇంట్లో ఎంత మంది ఉంటున్నారన్న లెక్క తీసుకుని వెళ్లారు.