
- రాయదుర్గంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
గచ్చిబౌలి, వెలుగు : ప్రముఖ మిసైల్ శాస్ర్తవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ రామ్నారాయణ్ అగర్వాల్(84) అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం రాయదుర్గంలోని మహాప్రస్థానంలో జరిగాయి. ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమం నిర్వహించారు. కంచన్బాగ్ రక్షాపురంలోని ఆయన ఇంటి నుంచి రాయదుర్గంలోని మహాప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో కుటుంబసభ్యులు, డీఆర్డీఓ శాస్ర్తవేత్తలు పాల్గొన్నారు.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో రామ్ నారాయణ్ పార్థివదేహానికి ఆయన కుమారుడు అక్షయ్ అగర్వాల్ శాస్ర్తోత్తకంగా తలకొరివి పెట్టారు. పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి నివాళి అర్పించారు. కాగా.. డీఆర్డీఓ చేపట్టిన అనేక క్షిపణి ప్రాజెక్టుల్లో రామ్ నారాయణ్ కీలక పాత్ర పోషించారు. క్షిపణి పితామహుడిగా, అగ్నిమ్యాన్గా గుర్తింపు పొందారు.