తనదైన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో హీరోగా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు రామ్ పోతినేని. అయితే తన గత సినిమాలకు ఆశించిన స్థాయిలో విజయం దక్కకపోవడంతో ఈసారి తానే మెగా ఫోన్ పట్టడానికి రెడీ అయ్యాడు. రామ్ స్వీయ దర్శకత్వం వహిస్తూ, తమ సొంత బ్యానర్ ద్వారా ఆయన బ్రదర్ కృష్ణ చైతన్యను నిర్మాతగా పరిచయం చేస్తూ ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడట.
ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అతని విజన్‌తో ముందుకు వెళ్లనుందని టాక్. కథ, స్క్రీన్‌ప్లే, ప్రెజెంటేషన్ అన్నీ కొత్తగా ఉండేలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక విభిన్నమైన స్టోరీలైన్‌ను ఫైనల్ చేశారట.
సైఫై యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు స్ట్రాంగ్ కంటెంట్‌తో ఈ చిత్రం రాబోతోందని టాక్. ఈనెల 15న ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని తెలుస్తోంది.
మరో వైపు రామ్.. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దగ్గర అసోసియేట్‌గా వర్క్ చేసిన ఓ వర్థమాన దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ కూడా వినిపిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం.
