
మరో నాలుగు నెలల్లో అయోధ్యలో రామాలయం నిర్మిస్తామని బీజేపీ నాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. జార్ఖండ్‌లోని పాకూర్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. అయోధ్య రామమందిరంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, మరో 4 నెలల్లో అయోధ్యలో ఆకాశమంత ఎత్తులో రామాలయం నిర్మిస్తామని చెప్పారు.
నవంబర్ 9 న, అయోధ్య కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామజన్మభూమి న్యాస్‌కే చెందుతుందని వెల్లడించింది. బాబ్రీ మసీదుకు అయోధ్యలోనే 5 ఎకరాల భూమిని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.