రామచంద్ర భారతి, నందకుమార్‌లకు వైద్య పరీక్షలు.. పీఎస్‌కు తరలింపు

రామచంద్ర భారతి, నందకుమార్‌లకు వైద్య పరీక్షలు.. పీఎస్‌కు తరలింపు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్ లకు షౌకత్ నగర్ పీహెచ్ సీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ రోజు ఉదయం రామచంద్ర భారతి, నందకుమార్.. చంచల్ గూడ జైలు నుంచి విడుదలై బయటికి రాగానే టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నందకుమార్ పై బంజారా హిల్స్ పీఎస్ లో చీటింగ్ కేసు నమోదు కాగా.. రామచంద్ర భారతిపై ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్, ఫేక్ ఆధార్ కార్డ్ కేసు నమోదై ఉంది. ఈ కేసుల నేపథ్యంలో పోలీసులు బంజారాహిల్స్ పీఎస్ కి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత రామచంద్ర భారతి, నంద కుమార్ లను బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు. 

జైలు నుంచి విడుదలైన వెంటనే రామచంద్ర భారతి, నందకుమార్ లను పోలీసులు అరెస్టు చేయడంపై నందకుమార్ స్పందించారు. తాను 45 రోజుల పాటు జైల్లో ఉన్నానని, తనకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదని నందకుమార్ తెలిపారు. ఈ కేసుల గురించి పూర్తిగా తెలుసుకున్నాకే తాను మాట్లాడతానని స్పష్టం చేశారు.