కారు బీభత్సం : ఫుల్లుగా తాగి.. బజ్జీల బండిని ఢీకొట్టి..

కారు బీభత్సం : ఫుల్లుగా తాగి.. బజ్జీల బండిని ఢీకొట్టి..

హైదరాబాద్ : ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ గణేష్ నగర్ లో దారుణం జరిగింది. మద్యం మత్తులో కారు నడిపిన ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. టిఫిన్ సెంటర్ ఎదురుగా ఉన్న బజ్జీల బండిని ఢీకొట్టి.. అలాగే దూసుకెళ్లిపోయాడు. ఈ ర్యాష్ డ్రైవింగ్ ఘటనలో.. బండి తుక్కు తుక్కు కాగా.. ఓ వ్యక్తికి గాయాలయ్యాయి.

బజ్జీల బండిని ఢీకొట్టినా కూడా.. ఆ వ్యక్తి కారు ఆపలేదు. దీంతో.. స్థానికులు వెంబడించి కారు ఆపి.. డ్రైవర్ కు వార్నింగ్ ఇచ్చారు. రెండురోజుల కిందట జరిగిన ఈ సంఘటన విజువల్స్ ఓ ఇంటిదగ్గర సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ విజువల్స్ వైరల్ అయ్యాయి.  ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు.. తమకు డ్రంకెన్ డ్రైవ్ చేశారంటూ ఇప్పటివరకు కంప్లయింట్ రాలేదన్నారు.