రామప్ప ఆలయానికి రూ. 6.71 లక్షల ఆదాయం

రామప్ప ఆలయానికి  రూ. 6.71 లక్షల ఆదాయం

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: ములుగు జిల్లాల్లో యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలోని రామలింగేశ్వర స్వామి ఆలయ హుండీలను సోమవారం లెక్కించారు.  భక్తులు కానుకలుగా సమర్పించగా.. 6,17,954 రూపాయల ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్ తెలిపారు. లెక్కింపులో  సహాయక కమిషనర్ కుమారస్వామి, వెంకటాపూర్ తహసీల్దార్ గిరిబాబు, పాలంపేట సర్పంచ్ రాజు, ఆలయ అర్చకులు, శ్రీ వల్లి సేవా సమితి సభ్యులు, ఆలయ సిబ్బంది, పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.