
గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ డైరెక్షన్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ‘రామబాణం’. మే 5న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. గోపీచంద్ మాట్లాడుతూ ‘కమర్షియల్ ఫార్మాట్‌లో ఫ్యామిలీ ఎమోషన్ ఉంటే ఎంత బాగుంటుందో ఈ కథ అంత బాగుంటుంది. ఇంత మంచి కథ ఇచ్చిన భూపతిరాజాకి థ్యాంక్స్. శ్రీవాస్ అద్భుతంగా తెరకెక్కించారు. మా కాంబోలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాల మాదిరిగానే ఎంటర్టైన్మెంట్ విత్ ఎమోషన్స్ ఉంటాయి. నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్ చాలా పాజిటివ్‌గా ఉంటారు. ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నాడు. గోపీచంద్‌తో పాటు జగపతి బాబు, కుష్బూ లాంటి సీనియర్స్‌తో నటించడం హ్యాపీ అంది డింపుల్ హయతి. ‘ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. హ్యాట్రిక్ కాంబినేషన్ మా మైండ్‌లో తిరుగుతూ ఉంది. అది మాకు కాన్ఫిడెన్స్‌ని ఇచ్చింది’ అన్నాడు శ్రీవాస్. కార్యక్రమానికి హాజరైన దర్శకులు మారుతి, సంపత్ నంది సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్, అలీ, సప్తగిరి, భూపతి రాజా, అబ్బూరి రవి, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు.