బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌తో కొట్లాడింది బీజేపీ.. ఫలితం అనుభవిస్తున్నది కాంగ్రెస్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు 

బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌తో కొట్లాడింది బీజేపీ.. ఫలితం అనుభవిస్తున్నది కాంగ్రెస్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ అరాచక పాలనపై బీజేపీ నిరంతరం పోరాడితే.. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. ఆదివారం బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ప్రజాద్రోహులేనని, ఈ రెండు పార్టీల వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పోరాడాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా సంస్థాగతంగా బీజేపీతో పోటీపడలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో 35 వేల పోలింగ్ బూత్‌‌‌‌‌‌‌‌లు ఉంటే.. అందులో 31 వేల బూత్‌‌‌‌‌‌‌‌లకు కమిటీలు ఉన్నాయని, బీజేపీకి 42 లక్షల సభ్యత్వం, 870 మండలాల్లో యూనిట్లు ఉన్నాయని వివరించారు. ఓల్డ్ సిటీలో కూడా మైనారిటీలు బీజేపీలోకి రావడానికి క్యూ కడుతున్నారని, ఈ బలంతో రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పని చేస్తామని వెల్లడించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేపర్ లీకులతో నిరుద్యోగుల జీవితాలను ఆగం చేశారని, నిరుద్యోగ సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని మండిపడ్డారు. ''

హైడ్రాతో హైదరాబాద్ ప్రగతికి బ్రేక్..

సీఎం రేవంత్ రెడ్డి తీరు హిట్లర్‌‌‌‌‌‌‌‌ను గుర్తుకు తెస్తోందని రాంచందర్ రావు విమర్శించారు. హైడ్రా పేరుతో ఇండ్లను కూలుస్తూ రేవంత్ రెడ్డి పేదల గుండెల మీద గడ్డపార దించుతున్నారని ఆరోపించారు. పెద్ద పెద్ద సంస్థలను వదిలేసి, పేదోడి ఇంటిని కూల్చడం అన్యాయమన్నారు. ఈ విధానాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిందని, హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.