సంజయ్ కొడుకు ఇష్యూ..  వాళ్ల ఫ్యామిలీ మ్యాటర్..భగీరథ్‌‌‌‌‌‌‌‌ పై పోక్సో కేసుతో పార్టీకి సంబంధం లేదు: రాంచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు

సంజయ్ కొడుకు ఇష్యూ..  వాళ్ల ఫ్యామిలీ మ్యాటర్..భగీరథ్‌‌‌‌‌‌‌‌ పై పోక్సో కేసుతో పార్టీకి సంబంధం లేదు: రాంచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు
  • బండి సంజయ్ మా నాయకుడు.. తప్పు జరిగితే పోలీసులు చూస్కుంటరని కామెంట్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ వ్యవహారం.. వాళ్ల కుటుంబ సమస్య అని, దానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు స్పష్టం చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. భగీరథ్‌‌‌‌‌‌‌‌ వ్యవహారం పూర్తిగా వారి కుటుంబ విషయమని, ఏమైనా తప్పు జరిగిఉంటే లీగల్‌‌‌‌‌‌‌‌గా వాళ్లే చూస్కుంటారని అన్నారు. బండి సంజయ్ ఎప్పటికీ తమ నేత అని, ఆయనకు భగీరథ్‌‌‌‌‌‌‌‌పై కేసుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు అన్ని మతాలను సమానంగా చూడాలని సూచించారు. ఆలయాలు కట్టాలిగానీ, ఉన్నవాటిని కూల్చొద్దని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రభుత్వం అన్ని మతాలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం.. 

దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని రాంచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పూర్తిస్థాయిలో ఉద్యమిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు మోదీ గ్యారంటీల వైపు చూస్తున్నారని, పరేడ్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన మోదీ సభ విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. “గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా అహంకార పూరితంగా వ్యవహరిస్తోంది. అహంకారంతో నడిచిన గత సర్కారు ఏమైందో చూశాం. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు కూడా అదే పరిస్థితి వస్తుంది’’ అని రాంచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు హెచ్చరించారు. సర్ పేరుతో ఎవరి ఓట్లను తొలగించట్లేదని చెప్పారు.