హైదరాబాద్, వెలుగు: మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణనిచ్చే సెంటర్ ఫర్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్(సీఈడీ) బోర్డు మెంబర్‌గా ప్రముఖ మెంటార్, గ్లోబల్ స్పీకర్ రమేశ్ వేముగంటి ఎన్నికయ్యారు. మహిళల ఎదుగుదల కోసం పనిచేస్తున్న ఈ సంస్థ.. ఇప్పటిదాకా తెలంగాణ, ఏపీల్లో 700 కార్యక్రమాలను నిర్వహించింది.
ఇందులో భాగంగా 2 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు, అమ్మాయిలు, విద్యార్థినులు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన మహిళలు, గ్రామీణ ప్రాంత యువతులకు శిక్షణ ఇచ్చినట్టు రమేశ్ తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్, సేల్స్, డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీ, మార్కెట్ లింకేజెస్‌కు సపోర్ట్ తదితర కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. మేనేజ్, ఎన్‌ఎస్‌డీసీ, ఎంఎస్‌డీఈ వంటి సంస్థల సహకారంతో సీఈడీ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.
