
హైదరాబాద్ సిటీ, వెలుగు: రామ్‌కీ ఫౌండేషన్‌కు టస్కర్ అవార్డు లభించింది. సీఎస్‌ఆర్ ఎక్స్‌లెన్స్ విభాగంలో ఈ అవార్డును ప్రముఖ కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ తిరువనంతపురంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఎంవీ రామిరెడ్డికి అందజేశారు. 2024–-25లో సహజ వనరుల సంరక్షణ, విద్య, వైద్యం, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, మహిళా సాధికారత వంటి రంగాల్లో రామ్‌కీ ఫౌండేషన్ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఇండో కాంటినెంటల్ ట్రేడ్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ప్రమోషన్ కౌన్సిల్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ప్రముఖ వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి.