ఎన్నాళ్ల నుంచో రాదనుకున్న రోడ్డు.. హైడ్రా ఎంట్రీతో వచ్చేసింది ..రాంనగర్ మణెమ్మ గల్లీ వాసుల ఆనందం

ఎన్నాళ్ల నుంచో రాదనుకున్న రోడ్డు.. హైడ్రా ఎంట్రీతో వచ్చేసింది ..రాంనగర్ మణెమ్మ గల్లీ వాసుల ఆనందం

ముషీరాబాద్, వెలుగు: ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న రాంనగర్ మణెమ్మ గల్లీకి హైడ్రా చొరవతో రోడ్డు వచ్చేసింది. రాంనగర్ చౌరస్తా పక్కన ఉన్న ఈ గల్లీలో సుమారు 20 ఇండ్లు ఉండగా, ఇరువైపులా జరిగిన అక్రమ భవన నిర్మాణాల వల్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 

డ్రైనేజీ, మంచినీటి సరఫరా, రోడ్డు వంటి ప్రాథమిక సౌకర్యాల కోసం ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు, అధికారులను స్థానికులు కలిసినా సమస్యలు పరిష్కారం కాలేదు. చివరకు మణెమ్మ గల్లీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేయగా, కమిషనర్ రంగనాథన్ రెవెన్యూ అధికారులతో కలిసి ఇటీవల గల్లీని పరిశీలించారు. 

రెవెన్యూ రికార్డుల ఆధారంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అనంతరం గల్లీలో సిమెంట్ రోడ్డు వేసి పనులను పూర్తి చేశారు. ఎన్నాళ్ల నుంచో రాదనుకున్న రోడ్డు ఇప్పుడు అందుబాటులోకి రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.