ఎన్నికల కోసమే సీఎం యూటర్న్​

ఎన్నికల కోసమే సీఎం యూటర్న్​
  • విలీనం వెనుక ఆస్తులను అమ్మే కుట్ర
  • మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​ ధ్వజం

హైదరాబాద్​: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కేవలం ఎన్నికల స్టంట్​ మాత్రమేనని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​​ అన్నారు. కేసీఆర్​ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులపై కపట ప్రేమ చూపుతున్నాడన్నారు. కేసీఆర్​ కుట్రకు కార్మికులు బలికావద్దని ఆయన పిలుపునిచ్చారు. ‘గతంలో విలీనం సాధ్యం కాదని చెప్పిన కేసీఆరే ఇప్పుడు ఎన్నికల కోసం యూటర్న్​ తీసుకున్నాడు. విలీనం కోరుతున్న పార్టీలకు అసలేం తెలియదంటూ ఎగతాళి చేశాడు. 

ఇదే నిర్ణయాన్ని గతంలోనే తీసుకుంటే 38 మంది కార్మికులు చనిపోయేవారా?. ఆర్టీసీ బకాయిలపై సీఎం సమాధానం చెప్పడంలేదు. దీని వెనుక ఆర్టీసీ ఆస్తులను అమ్మే కుట్ర ఉంది. కేసీఆర్​ ఫొటోలకు పాలాభిషేకం చేసింది కార్మికులు కాదు.. అదంతా స్థానిక ఎమ్మెల్యేల హడావిడి. సమ్మె విరమణ టైంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదు. డీజిల్​ పై ట్యాక్స్​ ఎందుకు ఎత్తివేయడం లేదు. 2018లోనే మేం ఆర్టీసీ విలీనాన్ని మ్యానిఫెస్టోలో పెట్టాం’అంటూ రాములు నాయక్​ వివరించారు.