‘రానా నాయుడు’ 18 ప్లస్ వయసు వారికే: హీరో రానా

‘రానా నాయుడు’ 18 ప్లస్ వయసు వారికే: హీరో రానా

దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్, రానా కాంబో వచ్చిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. క్రైమ్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి నెటిఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ పై నెట్టింట సర్వత్రా విమర్శలు వెల్లువెతున్నాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు. అశ్లీలత ఎక్కువగా ఉందంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో రానా నెటిజన్ల కామెంట్లపై స్పందించాడు.

"రానా నాయుడు సిరీస్ ను విమర్శిస్తున్న, అసహ్యించుకుంటున్న వారికి క్షమాపణలు చెబుతున్నాను. ఇదే సమయంలో తమ సిరీస్ కు ఇంతటి ఆదరణ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వెబ్ సిరీస్ ను కుటుంబంతో కలిసి చూడొద్దు. ‘ఏ’ రేటెడ్ సినిమా అని, 18 ప్లస్ వయసు వారికే.. ఒంటరిగానే చూడాలి" అని తెలిపాడు. కాగా, దర్శకులు కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ రానా నాయుడు వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. సంగీత్, సిద్ధార్థ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు.