అందుకే అన్నా..నువ్వంటే మాకిష్టం: అభిమాని గుండెలపై రానా ఆటోగ్రాఫ్

అందుకే అన్నా..నువ్వంటే మాకిష్టం: అభిమాని గుండెలపై రానా ఆటోగ్రాఫ్

టాలీవుడ్ మోస్ట్ వర్సటిలిటీ యాక్టర్ రానా దగ్గుబాటి( Rana Daggubati) ..మొదటి నుంచి కథ ప్రాధాన్యం ఉన్న మూవీస్ ను ఎంచుకుంటూ తనలోని యాక్టర్ ను బయటికి వచ్చేలా చేస్తున్నారు. అలాగే, రానా సినిమా వేదికలపైనా, జనాల మధ్యలో అయిన తనదైన శైలిలో మాట్లాడ గల చాతుర్యం కలిగిన వ్యక్తిగా ఎంతో గుర్తింపు పొందాడు. దారిలో ఎవరు పలకరించినా..చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. 

ప్రస్తుతం రానా తన సతీమణితో కలిసి అమెరికా వెకేషన్‌లో ఉన్నారు. అక్కడ అందమైన ప్రదేశాల్లో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చికాగోలో కారులో వెళ్తుండగా..రానాను చూసిన ఓ తెలుగు అభిమాని డ్రైవింగ్ చేస్తూనే హాయ్ అంటూ నవ్వుతూ పలకరించారు. ఆ వెంటనే రానా అతడికి హాయ్ చెప్పారు. ముందర కారు ఆపుతా అంటూ తన ఫ్యాన్‌కి రానా సిగ్నల్ ఇవ్వగానే  కారు ఆపి ఆ అభిమాని రానాను గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్ అయ్యారు.

 అంతేకాకుండా రానా అతడి ఫ్యామిలీతో కూడా మాట్లాడి..రోడ్డు పక్కనేవారితో కలిసి సరదాగా సెల్ఫీలు దిగి జోష్ పెంచారు. అయితే ఆ ఫ్యాన్ తన గుండెలపై ఆటోగ్రాఫ్ చెయ్యాలంటూ రానాను కోరారు. దీనికి ముందు రానా వద్దన్నాడు. అయితే చెప్పినా వినకుండా తన షర్ట్‌పై (అభిమాని గుండెలపై) ఆటోగ్రాఫ్ చేయించుకున్నారు ఆ ఫ్యాన్. అలానే తన కారుపై కూడా సైన్ చేయాలంటూ కోరారు. ఆయన అభిమానాన్ని చూసి రానా కూడా మురిసిపోయారు. అభిమాని కోరినట్లుగానే కారుపై ఆటోగ్రాఫ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘అందుకే అన్నా.. నువ్వంటే మాకిష్టం’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం రానా సినిమాల విషయానికి వస్తే..రజినీకాంత్‘వేట్టయాన్’ (వేటగాడు) మూవీలో కీ రోల్ నటిస్తున్నారు.అలాగే ‘రానా నాయుడు2’ వెబ్ సిరీస్‌తో పాటు మరో కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు.