ఇండియాలో ఫస్ట్ : 24 గంటలూ యానిమల్ మూవీ షోలు

ఇండియాలో ఫస్ట్ : 24 గంటలూ యానిమల్ మూవీ షోలు

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా మోస్ట్ వైల్డ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్ లో వచ్చిన మూవీ యానిమల్(Animal). డిసెంబర్ 1 న రిలీజైన మూవీ..వారం అయిన థియేటర్స్ లో దూసుకెళ్తోంది.రిలీజైన రెండోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించి బాక్సాపీస్ ను షేక్ చేస్తోంది. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ఈ వైల్డ్ యాక్షన్‌ థ్రిల్లర్‌ రోజురోజుకు ఆడియన్స్ పై గట్టి ప్రభావం చూపుతుంది. ఈ మూవీ ఇప్పటివరకు ఉన్న ఇండియా స్క్రీనింగ్ షెడ్యూల్స్ అన్నీ మారిపోయేలా చేస్తోంది. ఈ సినిమా కోసం రోజుకు 5 నుంచి 6 ఆటలు సరిపోట్లేదని ఆడియన్స్ నుంచి విపరీతమైన డిమాండ్స్ వస్తుండటంతో..మేకర్స్ 24 గంటలు షోస్ పడేలా స్క్రీనింగ్ టైమ్స్ పెంచేశారు.

ఇందుకు ముంబైలోని మాక్సస్ సినిమాస్ థియేటర్స్ లో మార్నింగ్ షోస్ 1am, 2am తో పాటు 5:30am గంటలకు షోస్ వేస్తున్నారు. అలాగే గోరేగావ్‌లోని PVR ఒబెరాయ్ మాల్, అంధేరిలోని PVR సిటీ మాల్ మార్నింగ్ 12:30am, 1am  గంటలకు షో స్టార్ట్ అవ్వగా 5 am కు వరుసగా థియేటర్స్ లోని అన్ని స్క్రీన్స్ లో కేవలం యానిమల్ మూవీని ప్రదర్శిస్తున్నారు. ఇండియాలో ఫస్ట్ టైం 24 గంటలూ షోస్ పడేలా ఆడిన సినిమా ఏదైనా ఉందంటే..అది ఒక్క యానిమల్ మూవీ అంటూ వర్మ (Ram Gopal Varma) ఫోటో పోస్ట్ చేశారు. ప్రస్తుతం Animal shows సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఇదే విషయంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ..

యానిమల్‌ అనేది మూవీ కాదు. ఓ సోషల్‌ స్టేట్‌మెంట్‌’ అని కితాబిచ్చారు. సందీప్ మునుపెన్నడూ చూడని సీన్లని అద్భుతంగా చూపించడం బాగుంది. సినిమా అంటే ఇలాగే ఉండాలని అనుకునే డైరెక్టర్లందరికీ ఫ్యూజులు ఎగిరిపోయేలా ఒక ఎలక్ట్రిక్‌ షాక్ ఇచ్చాడు సందీప్ రెడ్డి. వాళ్ళు నమ్మే చాదస్తపు నైతిక విలువులన్నింటినీ తన చీపురు కట్టతో ఊడ్చి ఎత్తి చెత్త కుండీలో పడేశాడు.కెమెరా కనుగొన్న మొదలు ఇప్పటివరకూ అందరూ నమ్ముతున్న సినీ సంప్రదాయాలన్నింటినీ నీ ఎడమ కాలి బూటుతో తన్ని తన్ని రక్తాలు కక్కుకునేలా చేశావు సందీప్‌ అంటూ..డైరెక్టర్ సందీప్ రెడ్డిని ప్రశంసించారు. 

యానిమల్ కలెక్షన్స్ విషయానికి వస్తే..

నిన్నటి వరకు (డిసెంబర్ 5) రూ.425 కోట్లు రాబట్టింది.ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అల్లకల్లోలం సృష్టిస్తోంది ఈ సినిమా.కలెక్షన్స్ రోజు రోజుకు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి.అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకున్న సందీప్.. మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద తన మార్క్ రిపీట్ చేశాడు.