ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్.. ఆరు వాహనాలు సీజ్

ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్.. ఆరు వాహనాలు సీజ్

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి మొయినాబాద్ – సురంగల్ బైపాస్ వద్ద పోలీసులు గస్తీ నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేని బైక్​పై అనుమానాస్పదంగా తిరుగుతున్న హరిజన రామకృష్ణ (20), బద్దుల విజయ్ కుమార్ (22)ను అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో వీరు మొయినాబాద్​లో నాలుగు, చేవెళ్లలో ఒకటి, కూకట్ పల్లిలో ఒకటి కలిపి మొత్తం ఆరు బైకులు దొంగిలించినట్లు అంగీకరించారు. నిందితుల ఇండ్ల వద్ద దాచిపెట్టిన ఆ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఆదివారం రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్​కు తరలించారు.