మెగా వాయిస్‌‌తో రంగమార్తాండ

మెగా వాయిస్‌‌తో రంగమార్తాండ

ఎన్నో చిత్రాలకు చిరంజీవి వాయిస్ ఓవర్ స్పెషల్ అట్రాక్షన్‌‌గా నిలిచింది. తాజాగా దర్శకుడు కృష్ణవంశీ కోసం ఆయన మరోసారి తన గళాన్ని వినిపించారు. థియేటర్ ఆర్టిస్టుల జీవితం ఆధారంగా కృష్ణవంశీ రూపొందిస్తోన్న చిత్రం ‘రంగమార్తాండ’. ప్రకాష్​ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లీడ్ రోల్స్ చేస్తున్నారు.  ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమా కోసం లక్ష్మీ భూపాల రాసిన ‘నేనొక నటుడ్ని’ అనే షాయరీకి తన గొంతుతో ప్రాణం పోశారు చిరంజీవి. ‘

నేనొక నటుడ్ని, చప్పట్లను భోంచేస్తూ, ఈలలను శ్వాసిస్తూ, అనుక్షణం జీవించే అల్పసంతోషిని నేను, మీ అంచనాలు దాటే ఆజానుబాహుడ్ని, సంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుడ్ని, రాబోయే కాలంలో రాయబోయే చరిత్ర నేను, పూటపూటకూ రూపం మార్చుకునే అరుదైన జీవిని నేను’ అంటూ సాగిన షాయరీ ఓ నటుడి జీవితానికి అక్షర రూపం ఇచ్చినట్టుగా సాగింది. ముఖ్యంగా చిరంజీవి లాంటి నటుడి జీవితానికి దగ్గరగా అనిపించింది. మరాఠీ క్లాసిక్ మూవీ ‘నట సమ్రాట్‌‌’కి రీమేక్‌‌గా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది.