రికార్డ్ ధరకు రంగబలి ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రికార్డ్ ధరకు రంగబలి ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య(Naga Shourya) హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ రంగబలి(Rangabali). ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన మొదటి షో నుండే ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. దీంతో.. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగ శౌర్యకు రంగబలితో మంచి హిట్ పడింది. మొదటిరోజు ఈ సినిమాకు సూపర్ టాక్ రావడంతో.. ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయని సమాచారం. వీకెండ్స్ లో ఈ కౌంట్ మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇక సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో.. రంగబలి డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ సంస్థలు కూడా ఫ్యాన్సీ రేట్స్ తో ముందుకు వచ్చాయి. తాజా సమాచారం రంగబలి డిజిటల్ డైట్స్ ను నెట్ ఫ్లిక్స్(Netflix) సంస్థ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా రూ.7 కోట్లు ఖర్చు చేసిందట. రీసెంట్ గా వచ్చిన చిన్న సినిమాల్లో ఇది హైయెస్ట్ రేట్ కావడం విశేషం. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ఆగస్టు చివరి వారంలో ఉండనుందని సమాచారం.

రంగబలి సినిమా విషయానికి వస్తే.. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు పవన్ బసంశెట్టి(Pawan basamsetty) తెరకెక్కించారు. యుక్తి(Yukthi) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను.. సుధాకర్ చెరుకూరి నిర్మించారు.