" రంగరంగ వైభవంగా" టీజర్ రిలీజ్

" రంగరంగ వైభవంగా"  టీజర్ రిలీజ్

ఉప్పెన సినిమాతో మెగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్..తొలి మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్తో కొండపొలం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా..నటన పరంగా వైష్ణవ్ తేజ్కు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం రంగరంగ వైభవంగా మూవీతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అర్జున్‌ రెడ్డి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన గిరీశయ్య రంగరంగ మూవీకి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజైంది. 

హీరో హీరోయిన్లు ఇద్దరు చిన్నప్పుడు గొడవపడతారు. పెద్దయ్యక కూడా వారిద్దరు మాట్లాడుకోరు. అయితే హీరో హీరోయిన్ల మధ్య ఆటపట్టించే సన్నివేశాలు..ఒకరిని మరొకరు పోటాపోటీగా ఏడిపించడం ట్రైలర్లో  ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు..కామెడీ, సెంటిమెంట్ పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ ను చూస్తుంటే అర్థమవుతుంది.  ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. డైలాగ్స్ సైతం ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రంలో హీరోయిన్ గా కేతిక శర్మ  నటిస్తుండగా.. నవీన్ చంద్ర, సీనియర్ నరేష్, ప్రభు, సత్య, సుబ్బరాజు తో పాటు ఇతర  కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొత్తంగా ట్రైలర్ ను చూస్తుంటే..కుటుంబ కథా చిత్రం అనిపిస్తుంది.  ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాపినీడు బి సమర్పణ లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 2న రంగరంగ వైభవంగా మూవీని  విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.