షారుఖ్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘కింగ్’ చిత్రం

షారుఖ్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘కింగ్’ చిత్రం

షారుఖ్ ఖాన్, రాణీముఖర్జీ జంట పేరెత్తగానే..  చల్తే చల్తే, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, కభీ అల్వీదా నా కెహనా లాంటి సూపర్ హిట్స్‌‌‌‌ గుర్తొస్తాయి. ఇప్పుడీ హిట్ జోడీ మరోసారి ఒకే చిత్రంలో కలిసి కనిపించబోతున్నారు. షారుఖ్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘కింగ్’ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.  ఇందులో షారుఖ్‌‌‌‌తో కలిసి నటించబోతోంది రాణీ ముఖర్జీ.

అభిషేక్ బచ్చన్ విలన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  దీపికా పదుకొనే, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, జైదీప్‌‌‌‌ అహ్లావత్, అర్షద్ వార్సీ, అభయ్ వర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. షారుఖ్ కూతురు సుహానా ఖాన్ ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌‌‌‌ ఎంట్రీ ఇస్తోంది. ఆమెకు తల్లిగా రాణీముఖర్జీ నటించనుంది.

అతిథి పాత్రే అయినప్పటికీ కథకు ఎంతో కీలకమైన పాత్రను ఆమె పోషిస్తోందని సమాచారం. ఐదు రోజుల పాటు ఆమె షూటింగ్‌‌‌‌లో పాల్గొననుంది. సూపర్ హిట్ జోడీ షారుఖ్, రాణీముఖర్జీ తిరిగి కలిసి నటిస్తుండడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. మే 20న ముంబైలో ఈ మూవీ షూటింగ్ మొదలవబోతోంది. తర్వాతి షెడ్యూల్‌‌‌‌ యూరప్‌‌‌‌లో ఉండనుంది.  వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  ఇక ప్రస్తుతం ‘మర్దానీ 3’ షూటింగ్‌‌‌‌తో రాణీముఖర్జీ  బిజీగా ఉన్నారు.