బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మర్దానీ 3’. అభిరాజ్ మినవాల దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. జనవరి 30న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.
సోమవారం (Jan12) ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. డ్యూటీలో రాజీ పడకుండా ధైర్య సాహసాలను ప్రదర్శించే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణీ ముఖర్జీ ఇంప్రెస్ చేశారు. దేశంలో అదృశ్యమైపోతున్న అనేక మంది బాలికలను కాపాడేందుకు ఆమె చేసే పోరాటమే ఈ సినిమా కథాంశంగా ట్రైలర్ ద్వారా రివీల్ చేశారు.
రాణీ ముఖర్జీని ఎదిరించే విలన్ రోల్‌లో నటి మల్లికా ప్రసాద్ కనిపించారు. ‘సైతాన్’ ఫేమ్ జానకి బొడివాలా కీలక పాత్ర పోషించారు. మహిళా పోలీస్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న ఫిల్మ్ యూనివర్స్‌గా ‘మర్దానీ’ ఫ్రాంచైజీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి.
