
ఏడాది బ్రేక్ అనంతరం తిరిగి సినిమా షూటింగ్స్ లో పాల్గొనేందుకు సమంత(Samantha) సిద్ధమైంది. దానికంటే ముందు తాను ఇప్పటికే నటించిన సిటాడెల్(Citadel) వెబ్ సిరీస్ ప్రమోషన్ లో ఈ బ్యూటీ పాల్గొంటోంది.రీసెంట్గా సిటాడెల్ టీజర్ రిలీజ్ కాగా..ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
తాజాగా సమంత బాలీవుడ్ స్టార్ రణ్‍వీర్ సింగ్(Ranveer Singh)ఓ యాడ్ కోసం స్క్రీన్ షేర్ చేసుకుంది. పాపులర్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కోసం యాడ్‍లో ఈ ఏ ట్రేండింగ్ స్టార్స్ కలిసి నటించారు. వీరితో పాటుగా భారత స్టార్ క్రికెటర్ చతేశ్వర్ పూజర కూడా ఈ యాడ్‍లో ఉన్నారు.
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఐపీఎల్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ థీమ్‍తో వచ్చిన ఈ నయా యాడ్ వీపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ యాడ్ లో ఐపీఎల్ వేలం జరుగుతుంటే..పుజారాను కూడా ఆడిస్తామంటూ రణ్‍వీర్ సింగ్, సమంత వీడియో కాల్ చేసినట్టు ఈ యాడ్ షురూ అయింది. వెంటనే పూజారా అశ్చర్యపోగా “నువ్వు కొట్టిన నాలుగు సిక్సర్లపై ఒట్టు” అని సమంత అనడం చాలా క్యూట్ గా ఉంది. ఆ తర్వాత ఆటలో కాదని..తనకు తినిపిస్తానని రణ్‍వీర్ సింగ్ అంటారు. ఆ తర్వాత రణ్‍వీర్, సమంత, పుజార ఐపీఎల్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నట్టు యాడ్ ముగిసింది.ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతుండటంతో ట్రెండ్‍కు తగ్గట్టు ఈ యాడ్ తీసుకొచ్చింది జొమాటో.
మూడేళ్ల క్రితం ఫ్యామిలీ మ్యాన్ 2(Familu Man2) వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన సమంత..త్వరలో సిటాడెల్ అనే మరో సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరుణ్ ధావన్(Varun Dhavan)తో కలిసి ఆమె నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను రాజ్ అండ్ డీకే(Raj and Dk) డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తు తం ఈ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.సమంత ఈ స్పెషల్ యాడ్ లో ఆడియన్స్ కు మళ్లీ కనిపించటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. దీంతో మళ్లీ సినిమాలు కూడా చేయాలని సోషల్ మీడియాలో మస్తు పోస్టులు సైతం చేస్తున్నారు. సమంతను మళ్లీ వెండితెరపై చూడాలనుకునే ఫ్యాన్స్ మరికొన్ని రోజులు మాత్రమే ఆగాల్సి ఉంది.ప్రస్తుతం రణ్‍వీర్ సింగ్ సింగమ్ అగైన్, డాన్ 3లో నటిస్తున్నాడు.