
ఐపీఎల్ తర్వాత ఆటకు దూరంగా ఉంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ... మళ్లీ గ్రౌండ్ లోకి దిగాడు. అయితే ఈ సారి క్రికెట్ పిచ్ పై కాదు...ఫుట్ బాల్ గ్రౌండ్ లో సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల నిధుల సేకరణ కోసం ఆల్ స్టార్స్ ఫుట్ బాల్ మ్యాచ్ లో ధోనీ ఆడనున్నాడు. ఈ మ్యాచ్ కోసం బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ తో కలిసి ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. ధోనిని కలవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు రణ్ వీర్.