టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే : రాపోలు ఆనంద భాస్కర్

టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే : రాపోలు ఆనంద భాస్కర్

చౌటుప్పల్, వెలుగు: సమస్యల పరిష్కారం కోసం చేనేత కార్మికులు కేటీఆర్ ఇంటికి వెళ్తే అవహేళన చేశాడని.. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మునుగోడులో చేనేతల ఓట్లు అడుగుతున్నాడని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ప్రశ్నించారు. ఆదివారం చౌటుప్పల్ లో బీజేపీ ఏర్పాటు చేసిన పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడాడు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని అన్నారు. చేనేత కార్మికులకు ఎన్ హెచ్ డీసీ ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేక సబ్సిడీలను ఇస్తోందని, రాష్ట్రంలో కేసీఆర్ మాత్రం నియంత పోకడతో చేనేత కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు.

రాజగోపాల్ రెడ్డి తన సొంత డబ్బులతో అనేకమందికి ఇండ్లు కట్టించారని, వైద్య సహాయం చేశారని, కరోనా టైంలో నిత్యావసరాలు పంపిణీ చేశారన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆయనను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 21న మునుగోడులో చేనేత కార్మికుల బహిరంగ సభ ఉంటుందని, కేంద్రమంత్రి పియూష్ ​గోయల్​ వస్తున్నారని, చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.