వైరల్ వీడియో: అందమైన అడవిలో అరుదైన బ్లాక్ పాంథర్

వైరల్ వీడియో: అందమైన అడవిలో అరుదైన బ్లాక్ పాంథర్

న్యూఢిల్లీ: భారత్‌లో నల్ల చిరుత పులులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కర్నాటకలోని కొడగు, మైసూరుతోపాటు నాగర్‌‌హోల్ నేషనల్ పార్క్‌‌లో ఇవి దాదాపు పదిలోపే ఉండటం గమనార్హం. అల్ప సంఖ్యలో ఉన్న బ్లాక్ పాంథర్‌‌లు టూరిస్టులకే కాదు కెమెరా కళ్లకు చిక్కడమూ కష్టమే. తాజాగా ఓ నల్ల చిరుత ఇండియాలోని పర్వత అడవుల్లో తిరుగాడుతున్న ఫొటోలు, వీడియో నెట్‌‌లో వైరల్ అవుతున్నాయి.

ఈ చిరుత తిరిగిన ప్రాంతం తాలూకు వివరాలు మాత్రం తెలియరాలేదు. సఫారీ జీప్‌‌లో వెళ్తున్న టూరిస్టులు ఈ చిరుతను ఫొటోలు, వీడియో తీశారు. దేశంలో అతి తక్కువగా ఉన్న నల్ల చిరుత పులులను రక్షించడానికి జాగ్రత్తలు తీసుకోవాలంటూ వీడియోను చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. భగీరా (జంగిల్ బుక్‌లో నల్ల చిరుత పాత్ర)ను చూపించినందుకు థ్యాంక్స్, ఏదో ఓ రోజు దాన్ని కలుస్తానంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.