ఈ చేప నోరు అచ్చం మనిషిలాగే.. పళ్లు, దవడలతో ఆశ్చర్యం

ఈ చేప నోరు అచ్చం మనిషిలాగే.. పళ్లు, దవడలతో ఆశ్చర్యం

ఫిషింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చేసే పనిలో ఒక భాగం. చాలా మందికి ఇదే వృత్తి, ఇదే జీవనం కూడా. అయితే వారు అలా ఫిషింగ్ చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు ఆశ్చర్యపరిచే చేపలను చూస్తుంటారు. కొన్ని పెద్దగా, అత్యంత బరువైనవిగా ఉంటే.. మరికొన్ని స్పెషల్ క్వాలిటీస్ ను కలిగి ఉంటాయి. అదే తరహాలో ఇటీవల చార్లీ క్లింటన్ అనే ఓ యువ అమెరికన్ జాలరికి ఇలాంటి అద్భుతమైన క్షణాన్ని ఎక్స్ పీరియన్స్ చేశాడు. చెరువులో చేపలు పడుతుండగా అతనకి ఓ చేపను పట్టాడు. ఇది ఇప్పుడు ఓక్లహోమా డిపార్ట్‌మెంట్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ ద్వారా వైరల్ అవుతోంది.

ఈ చేప పాకు కుటుంబానికి చెందినదని తేలింది. ఇది పిరాన్హాస్‌తో దగ్గరి సంబంధం ఉన్న దక్షిణ అమెరికాకు చెందిన జాతుల సమూహం. ఇది రేజర్-పంటి రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ, పాకస్ మానవులకు ప్రమాదకరం కాదు. కొంతమంది వ్యక్తులు ఈ అన్యదేశ చేపలను.. చెరువులు, నదుల్లోకి వదులుతారని అధికారులు సూచించారు. ఇది యునైటెడ్ స్టేట్స్‌లో తరచుగా కనిపిస్తూ ఉంటుందని తెలిపారు.

క్లింటన్ పట్టుకున్న ఈ పాకు చేపలు సుమారు 3.5 అడుగుల పొడవు, 88 పౌండ్ల వరకు బరువు కలిగి ఉంటాయని ODWC అధికారులు పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, దీనికి మనిషిని పోలిన దంతాలు ఉండడం. ఈ రకం చేప ఇలా ఓ జాలరి వలలో పడడం ఇదేం మొదటిసారి కాదు. అంతకుముందు 2022లో ఒక విచిత్రమైన జలచరాన్ని పట్టుకున్నట్టుగా మత్స్యకారుడి చిత్రం ఆన్‌లైన్‌లో సంచలనం రేపింది. ఆ జీవి సముద్రపు లోతుల్లోంచి పట్టుకున్న.. పొడుచుకు వచ్చిన పళ్లతో ఉన్న పీతలా కనిపించింది. ఈ అసాధారణ జీవుల చిత్రాన్ని ఫోటోగ్రాఫర్ రోమన్ ఫెడోర్ట్సోవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. పశ్చిమ రష్యా తీరంలో కనుగొనబడిన ఈ అసాధారణ పీత ప్రత్యేక లక్షణాలను కూడా ఆయన వెల్లడి చేశారు.