- మెడికవర్ హాస్పిటల్స్ లో అరుదైన ఆపరేషన్
- 72 ఏండ్ల వృద్ధురాలికి పునర్జన్మ
పద్మారావునగర్, వెలుగు: ఓ వృద్ధురాలికి సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్లు అరుదైన ఆపరేషన్ నిర్వహించి పునర్జన్మ ప్రసాదించారు. శ్వాసలో ఇబ్బంది, స్వల్ప శ్రమకే ఆయాసం బాధపడుతూ 72 ఏండ్ల వృద్ధురాలు హాస్పిటల్లో చేరింది. పరీక్షల్లో ఆమెకు తీవ్రమైన మిట్రల్ వాల్వ్ లీకేజీ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. వయస్సు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఓపెన్ హార్ట్ సర్జరీ ప్రమాదకరమని భావించి, మల్టీడిసిప్లినరీ హార్ట్ టీమ్ కాథెటర్ ద్వారా కాలి రక్తనాళం నుంచి మినిమల్ ఇన్వేసివ్ విధానంలో చికిత్స నిర్వహించారు.
డా. ప్రమోద్ కుమార్ కుచులకంటి (డైరెక్టర్ - స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ & అడ్వాన్స్డ్ కోరనరీ ఇంటర్వెన్షన్స్) నాయకత్వంలో డా. సాగర్ చంద్రశేఖర్ భుయార్, డా. ఎన్. శివ ప్రసాద్ నాయుడు, డా. అమరేంద్ర కుమార్ సింగ్, డా. పర్వత్రాజ్ వరుణ్ గౌతమ్, డా. సుబ్రహ్మణ్యం కలిసి ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉండి, శ్వాసలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోందని బుధవారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్లు వెల్లడించారు.
