మానేరు డ్యాంలో అరుదైన వింత చేపలు

మానేరు డ్యాంలో అరుదైన వింత చేపలు

కరీంనగర్  సమీపంలోని లోయర్ మానేరు డ్యాంలో మత్స్యకారులకు రెండు అరుదైన వింత చేపలు దొరికాయి.  తిమ్మాపూర్ మండలం  అల్గునూర్ గ్రామానికి చెందిన మత్స్యకారులు డ్యాంలో చేపలు పడుతుండగా.. వలలో రెండు వింత చేపలు చిక్కాయి.  మామూలు చేపలతో పాటు వలకు చిక్కిన ఈ రెండు వింత చేపలు చూడడానికి ప్రత్యేక ఆకర్షణగా కనిపించాయని తెలిపారు మత్య్సకారులు.  పూర్తిగా నలుపు రంగు చారికలు ఉండగా.. మందంగా వెడల్పుగా మొప్పలు ఉన్నాయన్నారు. ఈ వింత చేపలను స్థానికులు చూసి ఆశ్చర్యపోయారని చెప్పారు. సాధారణంగా సముద్రాల్లో కనిపించే ఈ చేపలు రిజర్వాయర్ లోకి ఎలా వచ్చాయన్నది అంతు పట్టడం లేదని జాలర్లు చెబుతున్నారు. ఇది డెవిల్ జాతికి చెందిన చేప అని మరికొందరు అంటున్నారు. మొత్తంగా లోయర్ మానేరు డ్యాంలో ఇలాంటి అరుదైన చేపలు లభించడం స్థానికంగా చర్చనీయాశంగా మారింది.