ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈశాన్య ప్రాంతంలోని...రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లఫాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాణిజ్యానికి జీవనాడి

 ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈశాన్య ప్రాంతంలోని...రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లఫాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాణిజ్యానికి జీవనాడి

లండన్: ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈశాన్య ప్రాంతంలోని రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లప్ఫాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగరం ఇప్పుడు ప్రపంచంలోనే గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాణిజ్యానికి జీవనాడిగా ఉంది. దాదాపు 20 ఏండ్లనుంచి ఈ ప్రదేశం  ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ పరిశ్రమకు హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎదిగింది.   ఇక్కడి నుంచి   దాదాపు 30 దేశాలకుపైగా ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్నది. జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దక్షిణ కొరియా, భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐరోపా సమాఖ్య, చైనా దేశాలకు ఇక్కడినుంచే గ్యాస్​ వెళ్తున్నది.  

ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 1999లో అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్న పెట్రోనెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ సంస్థ  గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దిగుమతి చేసుకుంటున్నది.  భారత ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ దిగుమతుల్లో ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 40--–47శాతంవరకు హార్మూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జలసంధి దాటుకొని వస్తున్నాయి.  తాజాగా ఇక్కడి గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిశ్రమపై ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాడితో అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 118 డాలర్లకు చేరింది. 

గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే యూరప్, ఆసియా దేశాల్లో విద్యుత్, గ్యాస్ ధరలు భారీగా పెరుగుతాయి. రష్యా--, ఉక్రెయిన్ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత యూరోప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాలు గ్యాస్ కోసం ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే ఆధారపడ్డాయి. ఇప్పుడు ఈ ప్లాంట్ దెబ్బతినడంతో  ఆయా దేశాల్లో ఇంధన కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.  ఖతార్ నుంచి సరఫరా ఆగితే  ఎరువుల తయారీ, విద్యుత్ ఉత్పత్తి, స్టీల్ ప్లాంట్లపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇది ప్రపంచవ్యాప్త ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.