T20 World Cup 2024: వింతలన్నీ ఒక్క మ్యాచ్‌లోనే.. సినిమాను తలపించిన బంగ్లా, ఆఫ్గన్ మ్యాచ్

T20 World Cup 2024: వింతలన్నీ ఒక్క మ్యాచ్‌లోనే.. సినిమాను తలపించిన బంగ్లా, ఆఫ్గన్ మ్యాచ్

టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఒక సినిమానే తలపించింది. మంగళవారం (జూన్ 25) బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన సూపర్ 8 చివరి మ్యాచ్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఒక సినిమాకు కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలెమెంట్స్ ఈ మ్యాచ్ లోనే చోటు చేసుకున్నాయి. యాక్షన్, కామెడీ, కోపం, థ్రిల్, సంతోషం లాంటి అన్ని ఎమోషన్స్ ను ఈ మ్యాచ్ లో అందించారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై  థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 8 పరుగుల తేడాతో విజయం సాధించి వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి సెమీస్ కు చేరింది. ఈ మ్యాచ్ లో జరిగిన కొన్ని హైలెట్స్ ఇప్పుడు చూద్దాం. 

నవ్వు తెప్పించిన పరుగు:

ఆఫ్ఘనిస్తాన్ మొదట బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 16 ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్లో ఊపు మీదున్న గర్భాజ్ ను ఔట్ చేసే సువర్ణావకాశాన్ని బంగ్లాదేశ్ కోల్పోయింది. నాలుగో బంతికి గుర్బాజ్ బ్యాక్‌వర్డ్ దిశగా కట్ షాట్‌ ఆడాడు. అక్కడ పరుగుకు ఆస్కారం లేకపోయినా నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న ఓమర్జాయ్ రన్ కోసం వచ్చాడు. అప్పటికే రెండడుగులు వేసి గర్భాజ్ వెనక్కి వెళ్లడంతో  ఇద్దరి ఒకే సైడ్ ఉన్నారు. ఈ దశలో రనౌట్ కన్ఫర్మ్ అనుకున్నారు. 

పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రిషద్ బంతిని నాన్ స్ట్రైకింగ్ వైపు విసరకుండా స్ట్రైకింగ్ లో ఉన్న వారి వైపు విసిరాడు. ఇది కాస్త ఓవర్ త్రో రూపంలో మిస్సవ్వడం ఆఫ్ఘనిస్తాన్ కు కలిసి వచ్చింది. అయితే బంతి మిస్సవ్వడంతో ఇద్దరూ కలిసి నాన్ స్ట్రైకింగ్ వైపు పరిగెత్తారు. అంతలో గర్భాజ్ నేను వెళ్తాను నువ్వు స్ట్రైక్ లో ఉండు అని చెప్పి పరుగు పూర్తి చేశాడు.

 

 

కోపంతో బ్యాట్ విసిరేసిన రషీద్ ఖాన్ :

ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కు కట్టలు తెచ్చుకునే కోపం వచ్చింది. ఈ ఓవర్ లో భారీ షాట్ కు ప్రయత్నించిన రషీద్ ఖాన్ బంతిని బౌండరీ పంపించడంలో విఫలమయ్యాడు. అక్కడ పైకి లేవడంతో ఫీల్డర్ ఒక క్యాచ్ మిస్ చేశాడు. అప్పటికే ఒక పరుగు పూర్తి చేసిన రషీద్.. రెండో పరుగుకు రావాల్సిందిగా కోరాడు. రన్ తీసే అవకాశం ఉన్నా కరీం జనత్ రెండో పరుగు తీసేందుకు ఆసక్తి చూపించలేదు. ఈ దశలో రషీద్ కోపంతో బ్యాట్ ను జనత్ వైపు  విసిరి తన అసహనాన్ని ప్రదర్శించాడు. 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

 

నాయబ్ ఆస్కార్ లెవల్ యాక్టింగ్:

 

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 12 ఓవర్లో ఆల్ రౌండర్ నాయబ్ చేసిన యాక్టింగ్ తెగ వైరల్ అవుతుంది. మబ్బులు కమ్మి చినుకులు పడుతుండడంతో ఆఫ్గన్ ప్రధాన కోచ్ జోనాథన్ ట్రాట్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి సమయం వృధా చేయండి అన్నట్టుగా సంకేతమిచ్చాడు. అప్పటికే డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో రెండు పరుగులు ఆఫ్ఘనిస్తాన్ ముందుండడంతో స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న నాయబ్ ను తిమ్మిర్లు వచ్చాయని కింద పడ్డాడు. అయితే అప్పటికప్పుడు అతని మోకాలికి తిమ్మిర్లు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. 

అంతే కాదు ఈ సీన్ లో నాయబ్ తన నటనతో అదరగొట్టాడు. అచ్చం గాయం అయినట్టుగానే యాక్టింగ్ చేశాడు. దీంతో కొద్ది సేపు గ్రౌండ్ లో డ్రామా చోటు చేసుకుంది. ఈ దశలో వర్షం పడి మ్యాచ్ రద్దయితే ఆఫ్ఘనిస్తాన్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించి ఉండేది. అయితే వర్షం వెంటనే తగ్గిపోవడంతో మళ్ళీ మ్యాచ్ కొనసాగింది. మ్యాచ్ మొత్తానికి ఈ సీన్ హైలెట్ గా నిలవడం విశేషం.  

 

 

ఇక ఈ మ్యాచ్ లో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. మంగళవారం (జూన్ 25) హోరీహోరీగా సాగిన చివరి లీగ్ మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 8 పరుగుల తేడాతో విజయం సాధించి వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి సెమీస్ కు చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. డక్ వర్త్ లూయిస్ విధించిన 114 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 105 పరుగులకు ఆలౌటైంది.