వరుస బాలీవుడ్‌‌‌‌ సినిమాలతో బిజీగా రష్మిక

వరుస బాలీవుడ్‌‌‌‌ సినిమాలతో బిజీగా రష్మిక

టాలీవుడ్‌‌‌‌లో స్టార్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌ స్టేటస్‌‌‌‌ను అందుకున్న రష్మిక, ప్రస్తుతం వరుస బాలీవుడ్‌‌‌‌ సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం రణబీర్‌‌‌‌‌‌‌‌ కపూర్‌‌‌‌‌‌‌‌కి జంటగా ‘యానిమల్‌‌‌‌’లో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్‌‌‌‌ ముంబైలో జరుగుతోంది. ఓ వైపు షూటింగ్‌‌‌‌తో బిజీగా ఉంటోన్న ఆమె, మరో సినిమా డబ్బింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తోంది. రెండేళ్ల క్రితం ‘గుడ్‌‌‌‌ బై’ సినిమాతో రష్మిక బాలీవుడ్‌‌‌‌ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ హిందీ మూవీకే అమితాబ్‌‌‌‌తో కలిసి నటించే చాన్స్ అందుకుంది. అయితే కొవిడ్ కారణంగా షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. గత నెలలో పూర్తయింది. ‘గుడ్‌‌‌‌ బై’ షూటింగ్‌‌‌‌కు గుడ్‌‌‌‌ బై చెప్పడం చాలా కష్టంగా ఉందంటూ ఆమధ్య  ఎమోషనల్‌‌‌‌గా ఓ పోస్ట్ పెట్టిన రష్మిక, తాజాగా డబ్బింగ్ వర్క్ పూర్తి చేస్తోంది. ‘ఎప్పటికీ ఈజీ కాదు’ అంటూ ఈ సినిమాకు తను డబ్బింగ్ చెబుతోన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మిక.

జీవితం, కుటుంబ సంబంధాలు లాంటి ఎమోషన్స్‌‌‌‌ ఉన్న కామెడీ డ్రామా ఇది. బహుశా.. ఆ ఎమోషన్స్‌‌‌‌ను పలికిస్తూ డబ్బింగ్ చెప్పడం అంత ఈజీ కాదంటోంది కాబోలు రష్మిక. తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఆ ఎమోషనల్‌‌‌‌ డెప్త్‌‌‌‌ ఏమిటో తెలియాలంటే అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 7 వరకు ఆగాల్సిందే. మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రాకి జంటగా ‘మిషన్ మజ్ను’లోనూ నటిస్తోంది. ఇక తెలుగులో ‘పుష్ప 2’లో నటించబోతోంది. విజయ్‌‌‌‌కి జంటగా ఆమె నటిస్తోన్న ‘వారసుడు’ సెట్స్‌‌‌‌పై ఉంది.