అసిస్టెంట్ పెళ్ళిలో రష్మిక.. ఆలా చేయడంతో తెగ సిగ్గుపడిపోయింది.

అసిస్టెంట్ పెళ్ళిలో రష్మిక.. ఆలా చేయడంతో తెగ సిగ్గుపడిపోయింది.

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్స్ అన్న తర్వాత వారికి ఓక ప్రత్యేకమైన టీమ్ కచ్చితంగా ఉంటుంది. అందులో హెయిర్, మేకప్, డ్రస్సింగ్ ఇలా చాలా వాటికి సెపరేట్ అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళని తమ సొంత ఫ్యామిలీలా చూసుకుంటారు మన స్టార్స్. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా వెంటనె స్పందిస్తారు కూడా. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక(Rashmika mandanna) కూడా ఇలాంటి పనే ఒకటి చేసింది. 

తాజాగా ఆమె హైదరాబాద్ లో జరిగిన తన బ్యూటీ అసిస్టెంట్ పెళ్లికి హాజరైంది. నూతన వధువరులకు తన శుభాకాంక్షలు కూడా తెలిపింది. అయితే అక్కడివరకు బాగానే ఉంది కానీ.. ఆ నూతన దంపతులు రష్మిక ఆశీర్వాదం కోసం తన కాళ్ళు మొక్కారు. దాంతో ఎం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయిన రష్మిక తెగ సిగ్గుపడిపోయింది. ఇదంతా అక్కడే ఉన్న ఒక వ్యక్తి తన కెమెరాలో బందించి దానికి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన  పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బాలీవుడ్ లో యానిమల్ అనే పాన్ ఇండియా సినిమాల‍లో కూడా నటిస్తోంది ఈ బ్యూటీ. రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న ఈ సినిమా కూడా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.