Rashmika Mandanna: మరో వివాదంలో రష్మిక మందన్న

Rashmika Mandanna: మరో వివాదంలో రష్మిక మందన్న

నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకొని, పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ ట్యాగ్ ను సొంతం చేసుకున్న రష్మిక మందన్న మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్, సౌత్ సాంగ్స్ ను పోలుస్తూ.. ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రొమాంటిక్ సాంగ్స్ తెరకెక్కించడంలో బాలీవుడ్ ది బెస్ట్ అని.. సౌత్‌లో మాత్రం ఎక్కువగా మాస్, మసాలా కమర్షియల్‌ హంగులే ఉంటాయని రష్మిక వ్యాఖ్యానించింది. మిషన్ మజ్ను సినిమా, సాంగ్స్ ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక చేసిన ఈ కామెంట్స్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. 

మొన్నటికి మొన్న కన్నడ ఫిల్మ్ కాంతార సినిమాపై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన రష్మిక...కాంతారా సినిమాను చూడలేదని కామెంట్ చేసింది. దాంతో ఆమెను కన్నడ సినీ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు కూడా వచ్చాయి. ఆ వార్తలపై స్పందించిన రష్మిక.. తనను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. అనంతరం తాను కాంతార సినిమాను చూశానని, చాలా బాగుందని ఆ మూవీ టీంకు కూడా చెప్పినట్టు తెలిపింది. ఇక తాజాగా బాలీవుడ్, సౌత్ సాంగ్స్ పైనా కామెంట్స్ చేయడంతో రష్మిక మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ సందర్భంగా నెటిజన్లు ఆమెను పలు రకాలుగా ప్రశ్నిస్తున్నారు. సౌత్ లో రొమాంటిక్ సాంగ్స్ లేవా.. అలాంటి సాంగ్స్ వాళ్లు తీయలేరా అంటూ కడిగిపారేస్తున్నారు.